: అనంతపురం ఆసుపత్రిని తనిఖీ చేసిన మంత్రి పరిటాల సునీత
అనంతపురం ప్రభుత్వాసుపత్రిని మంత్రి పరిటాల సునీత ఇవాళ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డెంగీ బాధితులను మంత్రి పరామర్శించారు. ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ సరిగా జరుగుతోందా? అంటూ ఆమె రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యసేవలు సరిగా లేవంటూ రోగులు మంత్రికి మొరపెట్టుకున్నారు. పనితీరు మార్చుకోవాలంటూ జిల్లా వైద్యాధికారి, సిబ్బందిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.