: జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్క్ ఫీజు పెంపుపై మండిపడ్డ లక్ష్మీపార్వతి
జూబ్లీహిల్స్ లో ఉన్న కేబీఆర్ పార్క్ ఎంట్రీ ఫీజును ఏడాదికి రూ. 800 నుంచి రూ. 1500కు పెంచడంపై వైఎస్సార్సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఈ పార్కుకు ఎంతోమంది వాకింగ్ కోసం వస్తుంటారని... దాదాపు 70 మంది సీనియర్ సిటిజన్లు కూడా రోజూ వాకింగ్ చేస్తుంటారని... వీరిలో మధ్యతరగతి వారు కూడా ఉన్నారని చెప్పారు. ఫీజును పెంచడంలో తప్పులేదని... కాకపోతే, ఒకేసారి రెండింతలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎవర్నీ వాకింగ్ చేయరాదని ప్రభుత్వం చెబుతోందా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ నిర్ణయం అత్యంత దారుణమని అన్నారు. కేబీఆర్ పార్క్ ఫీజును పెంచుతూ జీహెచ్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.