: జడ్పీ ఎన్నిక యథావిధిగా జరుగుతుంది: నెల్లూరు జిల్లా కలెక్టర్


నెల్లూరు జడ్పీ ఎన్నిక షెడ్యూల్ ప్రకారం యథావిథిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఈ నేపథ్యంలో, జడ్పీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల బందోబస్తు మధ్య వైకాపా జడ్పీటీసీలు జిల్లాపరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లాలోని మొత్తం 46 మంది జడ్పీటీసీల్లో టీడీపీ, వైకాపాలకు చెరో 23 మంది సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఈ ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. అయితే, ఇంతవరకు టీడీపీ సభ్యులెవరూ జడ్పీ కార్యాలయానికి చేరుకోకపోవడం గమనించాల్సిన అంశం.

  • Loading...

More Telugu News