: నిరుద్యోగులకు ఉచిత వైద్యం: మంత్రి కామినేని శ్రీనివాస్
తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సందర్శించారు. స్విమ్స్ లో బ్లడ్ బ్యాంక్ ను, రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ, కర్నూలులో రూ.45 కోట్లతో కేన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకంలో సమూల మార్పులు తెస్తామని, త్వరలో ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ హెల్త్ కార్డుగా మారుస్తామని ఆయన అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ కార్డులతో నిరుద్యోగులకు ఉచిత వైద్యం అందించనున్నట్లు కామినేని చెప్పారు.