: మరోసారి వంకర బుద్ధిని చాటుకున్న పాక్


పాకిస్తాన్ తన వంకర బుద్ధిని మరోసారి చాటుకుంది. కాల్పుల విరమణ ఒప్పందాలకు తూట్లు పొడుస్తూ... పాక్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్మూకాశ్మీర్ లోని ఆర్ఎస్ పుర సెక్టార్ లో భారత జవాన్లపై పాక్ రేంజర్లు మోర్టార్లతో దాడి చేశారు. అయితే, ఈ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. రాత్రి 2 గంటల సమయంలో పాక్ దాడులను ప్రారంభించిందని ఓ బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. ఈ మోర్టార్ల దాడుల్లో బోర్డర్ కు సమీపంలో ఉన్న గ్రామంలోని కొన్ని పశువులు చనిపోయాయని, గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారని వెల్లడించారు. పరిస్థితి చక్కబడేంత వరకు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని గ్రామస్తులను హెచ్చరించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News