: దొంగతనంలో సక్సెస్ అయ్యారు... జీవితంలో ఓడిపోయారు!
ఏ టైంలో ఏమి జరగాలని రాసిపెట్టుందో అదే జరుగుతుంది. దానికి నిదర్శనం ఈ ఘటనే. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉదిత్యాల శివారులో ఓ మూతపడిన ఐరన్ పరిశ్రమ ఉంది. అందులోని ఇనుప పైపులు, ఇతర సామాన్లను చోరీ చేసేందుకు ఇద్దరు దొంగలు బయల్దేరారు. దొంగతనం సక్సెస్ ఫుల్ గా పూర్తిచేశారు. తమ వెంట తెచ్చుకున్న ట్రాలీలో పైపులను వేశారు. పైపులు కింద పడకుండా ఉండేందుకు నిలువుగా కొన్ని పైపులు పెట్టారు. అనంతరం, రోడ్డు ఎక్కిస్తుండగా నిలువుగా ఉన్న పైపు హైటెన్షన్ లైనును తాకింది. దీన్ని గమనించిన తిరుపతయ్య అనే దొంగ హడావుడిగా కాలు కింద పెట్టాడు. అంతే, 'ఎర్త్' కావడంతో అతను కాలి బూడిదయ్యాడు. ట్రాలీలోనే ఉన్న మరో దొంగ శంకర్ నాయక్ షాక్ తో ట్రాలీలోనే చనిపోయాడు.