: 24 నుంచి ఔషధ మొక్కలపై శిక్షణా తరగతులు
హైదరాబాదు నాంపల్లిలోని అగ్రి హార్టికల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ‘ఔషధ మొక్కలు - వాటి ఉపయోగాలు’ అనే అంశంపై మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు సొసైటీ ఛైర్మన్ నారాయణరావు తెలిపారు. 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ తరగతులు పబ్లిక్ గార్డెన్స్ లోని అగ్రి హార్టికల్చర్ సొసైటీ కార్యాలయంలో జరుగుతాయి. ఇందులో పాల్గొనేందుకు ఆసక్తి గల వారు 040-23299779, 65591474, 99120 46095 నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.