: సచిన్ తో చర్చలు ఫలప్రదం కాలేదు: మహేష్ భూపతి


ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్) షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని మహేష్ భూపతి తెలిపారు. లీగ్ కు ఎలాంటి ఆటంకాలు లేవని... నవంబర్ 28న ప్రారంభమవుతుందని చెప్పారు. ముంబై ఫ్రాంఛైజీ నుంచి పీవీపీ సంస్థ తప్పుకుందనే వార్తల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, టోర్నీ నుంచి ఏ ఫ్రాంఛైజీ కూడా తప్పుకోలేదని అన్నారు. అయితే, ముంబై ఫ్రాంఛైజీ ఓనర్ మైక్రోమ్యాక్స్ అని స్పష్టం చేశారు. గతంలో ముంబై ఫ్రాంఛైజీ కోసం సచిన్, పీవీపీ సంస్థలతో సంప్రదింపులు జరిపామని... అవి ఫలప్రదం కాలేదని భూపతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బిజీగా ఉన్నామని పీవీపీ తెలిపిందని... అందుకే వేరే యజమానిని తీసుకున్నామని వెల్లడించాడు.

  • Loading...

More Telugu News