: అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్న కేసీఆర్
హైదరాబాదు లాల్ దర్వాజా శ్రీసింహవాహిని దేవాలయంలో ఇవాళ అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు. 2002 తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తామని ఆలయ కమిటీ అమ్మవారికి మొక్కుకుంది. రాష్ట్రం ఏర్పడడంతో ఆలయ కమిటీ ప్రతినిధులు బోనం కుండను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు కుండలో బోనం సమర్పిస్తారని ఆలయ కమిటీ ఛైర్మన్ బల్వంత్ యాదవ్ తెలిపారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అమ్మవారికి పట్టుచీర సమర్పించనున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రముఖులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు.