: ఇవాళ హైదరాబాదులో మహంకాళీ జాతర


హైదరాబాదు లాల్ దర్వాజాలో ఇవాళ సింహవాహిని మహంకాళీ అమ్మవారి జాతర జరుగుతోంది. ఆషాఢమాస బోనాల ఉత్సవాల సందర్భంగా నగరంలోని అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. వేపాకులతో వీధుల్లో తోరణాలు కట్టారు. బస్తీల్లోని పోచమ్మ, మైసమ్మ, రేణుక ఎల్లమ్మ, మహంకాళీ అమ్మవార్ల ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లను చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News