: తన రికార్డు బద్దలు కొట్టిన భువనేశ్వర్ పై బేడీ ప్రశంసలు


ఇంగ్లండ్ లో మంచి ప్రదర్శన చేస్తున్న టీం ఇండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పై భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో భువనేశ్వర్ కుమార్ ఆరు వికెట్లు తీసి బేడీ రికార్డును తిరగరాయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, 'భువనేశ్వర్ కుమార్ నా తరహా ఆటగాడే. టెస్టుల్లో బెస్ట్ బౌలింగ్ ను నమోదు చేశాడ'ని అన్నారు. ఇంగ్లండ్ పై బిషన్ సింగ్ బేడీ ఆడిన చివరి టెస్టులో నెలకొల్పిన (5/82) రికార్డు ఇప్పటి వరకూ ఎవరూ బద్దలు కొట్టలేదు. ఇంగ్లండ్ లో ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన జాబితాతో ముగ్గురు భారతీయులే ఉన్నారు. వారు 1936లో లధా అమర్ సింగ్, 1974లో బిషన్ సింగ్, తాజాగా భువనేశ్వర్ కుమార్ కావడం విశేషం.

  • Loading...

More Telugu News