: మంత్రిని ఇరకాటంలోకి నెట్టిన సామాన్యురాలు


ఆయనో మంత్రి.. పేరు అహ్మదుల్లా. ఆయన ఆదేశం ఇస్తే చాలు అధికారులు ఆగమేఘాలపై స్పందిస్తారు. అలాంటి మంత్రికి నేడు స్వంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. ప్రజానీకంతో మమేకం కావడానికి కడప వచ్చిన మైనార్టీ శాఖ మంత్రి అహ్మదుల్లాను ఓ సామాన్యురాలు అడిగిన ప్రశ్న ఇరకాటంలోకి నెట్టింది. 'నాలుగేళ్ళ తర్వాత మమ్మల్ని చూసేందుకు వచ్చావా?' అంటూ ఆమె అడిగిన ప్రశ్నతో కంగు తినడం మంత్రి వంతైంది. అయితే, అధికారులు ఆమెకు సర్దిచెప్పడంతో మంత్రి ఊపిరిపీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News