: అనుష్క నగలు గల్లంతు!


అనుష్క ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న 'రుద్రమదేవి' సినిమా షూటింగ్ లో దొంగతనం చోటుచేసుకుంది. రుద్రమదేవి సినిమా షూటింగ్ కోసం తెచ్చిన కేజీన్నర బంగారు నగలు గల్లంతయ్యాయి. హైదరాబాదులోని నానక్ రామ్ గూడలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో ప్రధాన పాత్రధారి అనుష్క ధరించేందుకు ఈ నగలను బెంగళూరు నుంచి తెచ్చారు. తాము షూటింగ్ బీజీలో ఉండగా ఈ నగలను ఎవరో కాజేశారని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ప్రొడక్షన్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News