: చిన్నారి అత్యాచారంపై వేడెక్కుతున్న బెంగళూరు
బెంగళూరు వేడెక్కుతోంది. ఆరేళ్ల చిన్నారిపై పాఠశాలలో అత్యాచారం జరగడంపై బెంగళూరు యావత్తు ఆందోళన వ్యక్తం చేస్తోంది. అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా బెంగళూరులో మహిళలు, విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పాఠశాల నుంచి హెచ్ ఏఎల్ పోలీస్ స్టేషన్ వరకు ప్లకార్డులు చేబూని భారీ ర్యాలీ నిర్వహించారు. తక్షణం పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.