: తెలంగాణలో 800 మెగావాట్ల విద్యుత్ లోటు: తెలంగాణ పీడీసీఎల్ ఎండీ
రాష్ట్రంలో 800 మెగావాట్ల విద్యుత్ లోటు ఉందని తెలంగాణ పీడీసీఎల్ ఎండీ రఘుమారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది తెలంగాణలో 500 మెగావాట్ల వ్యవసాయ విద్యుత్ డిమాండ్ పెరిగిందని అన్నారు. ప్రస్తుతానికి తాము 5 వేల మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఉత్తరాది నుంచి విద్యుత్ తెప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేసిందని ఆయన చెప్పారు. వర్షాలు పడి డిమాండ్ తగ్గితే వ్యవసాయానికి 7 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. విద్యుత్ చార్జీల పెంపుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.