: ఉద్యమాలు ఆపండి... ఉద్యోగాల కోసం చదువుకోండి: నాయిని


పోలీసులు తమపై అన్యాయంగా లాఠీఛార్జ్ చేశారని ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఉద్యోగాల కోసం పోరాడుతున్న తమపై అన్యాయంగా లాఠీలు ఝుళిపించారని వాపోయారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ, విచారణ జరిపి పోలీసులపై చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఇకపై విద్యార్థులందరూ ఉద్యమాలను ఆపాలని... ఉద్యోగాల కోసం మంచిగా చదువుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను వెట్టిచాకిరి కింద భావిస్తున్నందునే... వారిని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

  • Loading...

More Telugu News