: ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా కాశ్మీర్ లో నిరసన... యువకుడు మృతి
ఇజ్రాయెల్ దళాలు గాజాలో సృష్టిస్తున్న హింసాకాండపై కాశ్మీర్ లోని కుల్గమ్ జిల్లాలో నిరసన మొదలైంది. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా పలువురు యువత, విద్యార్థులు, ఇతరులు చేస్తున్న ఆందోళనను భద్రతా దళాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. ఈ సమయంలో అనుకోకుండా జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు చనిపోయాడు. మరొకరికి గాయాలయ్యాయని జిల్లా పోలీసు అధికారి తెలిపారు. ఉదయం నుంచి చేస్తున్న ఆందోళన ఇతర ప్రాంతాలకు వ్యాపించి హింసాత్మకంగా మారబోతున్న సందర్భంలో కాల్పులు జరపాల్సి వచ్చిందని వెల్లడించారు.