: తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ కు 24 పరుగుల ఆధిక్యత... ఆకట్టుకున్న భువీ
భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్సింగ్స్ లో ఇంగ్లండ్ మెరుగైన ప్రదర్శన చేసింది. బౌలింగ్ లో సత్తా చాటిన ఇంగ్లీష్ ఆటగాళ్లు బ్యాటింగ్ లోనూ మంచి ప్రదర్శన చేశారు. దీంతో ఇంగ్లండ్ 319 పరుగులకు ఆలౌటైంది. బల్లన్స్ (113), అలీ (32), ప్లంకెట్ (55), ప్రయర్ (23), కుక్ (10), రాబ్సన్ (17), బెల్ (16), రైట్ (13), బ్రాడ్ (19), ఆండర్సన్ (20) చక్కని సహకారమందించడంతో తొలి ఇన్సింగ్స్ లో భారత్ కు దీటైన స్కోరు ఇంగ్లండ్ సాధించింది. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన 24 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ చక్కని ప్రదర్శన చేశాడు. ఆఫ్ స్టంప్ కు ఆవల బంతులేస్తూ ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ కు పరీక్ష పెట్టాడు. కీలకమైన 6 వికెట్లు తీసుకున్న భువీ విదేశాల్లో తన ప్రదర్శనను మెరుగుపరుచుకున్నాడు. భువీ ఆటతీరుపై ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తొలి టెస్టు రెండు ఇన్సింగ్స్ లోనూ, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బ్యాటుతో రాణించిన భువీ బౌలింగ్ లో కూడా మెరుగుపడటం శుభసూచకమని పేర్కొంటున్నారు. కాగా, భువీకి జడేజా (2), షమి (1) చక్కని సహకారమందించారు. ఓపెనర్ మురళీ విజయ్ ఒక వికెట్ తీయడం విశేషం. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా లంచ్ విరామానికి పది పరుగులు చేసింది. ధావన్ (10), విజయ్ క్రీజులో ఉన్నారు.