: వెంకయ్యను ఆకాశానికెత్తేసిన చంద్రబాబు


తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి వెంకయ్యనాయుడు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. అధికారపక్షంలో ఉన్నప్పటికీ వెంకయ్యనాయుడు ఎల్లప్పుడూ ప్రజలపక్షానే ఉంటారని కితాబిచ్చారు. రాష్ట్రాన్ని విభజించిన తీరు తననెంతో మనస్తాపానికి గురిచేసిందని తెలిపారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రాకపోయి ఉంటే చాలా ఇబ్బందులు పడి ఉండేవారమని చెప్పారు. కేవలం వెంకయ్యనాయుడి చొరవ వల్లే ఏపీకి అత్యధికంగా మెడికల్ సీట్లు వచ్చాయని తెలిపారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వముందని... రాష్ట్రంలో టీడీపీ ఉందని... దీంతో, రాబోయే కాలంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే బాధ్యత తనదే అని చెప్పారు.

  • Loading...

More Telugu News