: హైదరాబాదులో కూల్చివేతలపై లోకాయుక్తలో టీడీపీ ఫిర్యాదు
అక్రమ నిర్మాణాల పేరుతో హైదరాబాదులో కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్న జీహెచ్ఎంసీ కూల్చివేతలపై లోకాయుక్తలో తెలంగాణ టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు చేపడుతున్న కూల్చివేతలను ఆపాలని కోరారు. ఇప్పటివరకు అయ్యప్ప సొసైటీ, గోకుల్ ఫ్లాట్స్ లో భవనాలను, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్ లో పలుచోట్ల నిర్మాణాలను కూల్చివేశారు.