: కేసీఆర్ పై ఏపీ మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు: హోంమంత్రి నాయిని


విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ ను స్థానికత ఆధారంగా చెల్లిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఖండించారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ఏపీ నేతల తీరు ఉందన్న నాయిని, ఏపీ మంత్రులు కొందరు కేసీఆర్ పై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఏపీ విద్యార్థులకు వారి ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలని, తెలంగాణ విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ తమ బాధ్యత అని చెప్పారు. ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని నిర్మించుకుంటామన్నవారు తమ విద్యార్థుల ఫీజులు చెల్లించలేరా? అని ప్రశ్నించారు. ఎవరి ప్రజలు, విద్యార్థుల బాగోగులు వారే చూసుకుంటే మంచిదని సూచించారు.

  • Loading...

More Telugu News