: విమాన ప్రమాద ఆధారాలను రష్యా సాయంతో నాశనం చేసేందుకు యత్నం: ఉక్రెయిన్
మలేసియా ఎంహెచ్ 17 విమానం కూలిపోవడానికి కారణం రష్యానేనని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనకు సంబంధించిన రుజువులను రష్యా మద్దతుతో నాశనం చేసేందుకు వేర్పాటువాదులు ప్రయత్నించారని నిందిస్తూ ఉక్రెయిన్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేగాక ఘటనా స్థలం నుంచి 38 మృత దేహాలను తొలగించారని, సైట్ యాక్సెసింగ్ నుంచి ఉక్రెయిన్ పరిశోధకులను బ్లాక్ కూడా చేశారని పేర్కొంది.