: మృతులను గుర్తించాం: మలేసియా


ఉక్రెయిన్ వేర్పాటువాదుల దాడిలో నేలకొరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించినట్లు మలేసియా శనివారం ప్రకటించింది. మరణించిన వారిలో అత్యధికులు నెదర్లాండ్స్ కు చెందిన వారేనని మలేసియా ఎయిర్ లైన్స్ విడుదల చేసిన జాబితా వెల్లడించింది. నెదర్లాండ్స్ కు చెందిన వారు 192 మంది కాగా, వారిలో ఒకరు డచ్ తో పాటు అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారని ఆ జాబితా తెలిపింది. 15 మంది విమాన సిబ్బంది, నలుగురు పిల్లలతో పాటు మలేసియాకు చెందిన 44 మంది మరణించారు. ఇంకా 22 మంది ఆస్ట్రేలియన్లు, ఓ శిశువుతో కలిపి 12 మంది ఇండోనేసియన్లు ఉన్నారు. దక్షిణాఫ్రికా పౌరసత్వం కలిగిన ఓ పౌరుడితో పాటు తొమ్మిది మంది బ్రిటన్ పౌరులు, నలుగురు చొప్పున జర్మనీ, బెల్జియం వాసులు, ముగ్గురు ఫిలిప్పీన్స్ వాసులు, న్యూజిల్యాండ్, కెనడాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారని ఆ జాబితా వెల్లడించింది.

  • Loading...

More Telugu News