: గుజరాత్ మృగరాజులకు మధ్యప్రదేశ్ లో రక్షణ
ఇకనుంచి గుజరాత్ లోని కొన్ని సింహాలకు మధ్యప్రదేశ్ లో రక్షణ కల్పించనున్నారు. ఈ మేరకు గుజరాత్ లోని గిర్ అడవుల నుంచి కొన్ని సింహాలను మధ్యప్రదేశ్ లోని 'కునో పల్పూర్' అభయారణ్యానికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతరించిపోతున్న సింహాల సంఖ్య పెంచుకోవాలంటే 6 నెలల్లోగా సింహాలను తరలించాలని గుజరాత్ సీఎం మోడీ సర్కార్ ను సుప్రీం ఆదేశించింది.
అంతకుముందు సింహాలను తమ రాష్ట్రానికి పంపాలని ఎంపీ ప్రభుత్వం కోరగా గుజరాత్ తిరస్కరించింది. దీంతో ఓ ప్రయోజన వ్యాజ్యం దాఖలవడంతో సుప్రీం జోక్యం చేసుకుని సింహాలను తరలించేందుకు అనుమతినిచ్చింది. ఈ సందర్భంగా గుజరాత్ వాదనను న్యాయస్థానం తిరస్కరించింది. అన్ని సింహాలు ఒకేచోట ఉంటే అంత సురక్షితం కాదని, రెండో చోట కూడా వాటికి ఆశ్రయం కల్పించాలని కోర్టు అభిప్రాయపడింది. అయితే ఆఫ్రికా చీతాలను భారత్ లో అనుమతించేందుకు మాత్రం సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.