: షకీరా ఫేస్ బుక్ రికార్డు


గ్రామీ అవార్డు విజేత, వరల్డ్ పాప్ క్వీన్ షకీరా (37) ఫేస్ బుక్ లో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సోషల్ మీడియా సైట్లో 100 మిలియన్ల లైకులను పొందిన తొలి వ్యక్తిగా షకీరా అవతరించింది. దీనిపై షకీరా స్పందిస్తూ, ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంది. తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాని తెలిపింది. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఫేస్ బుక్ సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరాన్ని తగ్గిస్తోందని కొనియాడింది. కాగా, ఈ విషయమై ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ షకీరాను అభినందించారు. ఇదో అద్భుతమైన మైలురాయి అని కొనియాడారు.

  • Loading...

More Telugu News