: శిక్షణా తరగతులకు జగన్ వచ్చుంటే హుందాగా ఉండేది: మంత్రి యనమల
కొత్తగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు నిర్వహించిన శిక్షణా తరగతులకు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హాజరుకాకపోవడంపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఎమ్మెల్యేల శిక్షణా తరగతులకు అసెంబ్లీ స్పీకర్ అందరికీ ఆహ్వానాలు పంపారని చెప్పారు. జగన్ కూడా వచ్చి ఉంటే హుందాగా ఉండేదన్నారు. రాకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు.