: కేసీఆర్ అభ్యంతరాలు వాస్తవమే: సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్ణ మద్దతు పలికారు. పోలవరం ప్రాజెక్టుపై కేసీఆర్ లేవనెత్తుతున్న అభ్యంతరాలు వాస్తవమేనని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తాము కూడా వ్యతిరేకం కాదని... కాకపోతే ప్రాజెక్ట్ డిజైన్ ను మాత్రమే మార్చాలని డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భూమి కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించాలని కోరారు.