: ఆపరేషన్ చేసిన నర్సులు... గర్భిణి మృతి
వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్ఠ ఈ ఘటన. ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణికి నర్సులే ఆపరేషన్ చేశారు. సుశిక్షిత వైద్యుల సమక్షంలో జరగాల్సిన ఆపరేషన్ ను నర్సులు చేయడంతో... ఆ నిండు గర్భిణి మృతి చెందింది. కూతురి మరణవార్తను విని తట్టుకోలేని ఆమె తండ్రి కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా వినుకొండలో చోటుచేసుకుంది.