: ఏఏపీ నేత, కార్యకర్తల అరెస్టు... రాజకీయ కుట్రని పార్టీ ఆరోపణ


ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ విభాగం సెక్రెటరీ దిలీప్ పాండేతో పాటు పలువురు పార్టీ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ ఢిల్లీ జామియా నగర్ ప్రాంతంలో వివాదాస్పద పోస్టర్లు అంటించి వర్గాల మధ్య మత హింసను ప్రోత్సహించారన్న ఆరోపణలతో నిన్న (శుక్రవారం) సాయంత్రం వారిని పోలీసులు విచారించారు. అనంతరం భారత శిక్షా స్మృతిలోని నాన్ బెయిలబుల్ సెక్షన్స్ 153, 295 కింద అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పార్టీ ముఖ్య నేత మనీష్ శిసోడియా స్పందిస్తూ, ఇదొక రాజకీయ కుట్ర అని ఆరోపించారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ తాము చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆ పార్టీ కక్ష తీర్చుకునేందుకు ఇలా చేసిందన్నారు. ఆ పోస్టర్ల వెనుక తమ నేతల ప్రమేయం లేదని, వారినెందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News