: సౌదీ జైళ్ళలో ఉన్న భారతీయులకు విముక్తి
సౌదీ అరేబియా జైళ్ళలో ఏడాది కాలంగా మగ్గిన 40 మంది భారత కార్మికులు నేడు స్వదేశానికి రానున్నారు. బాధితుల బంధువులు ఇటీవలే కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. దీంతో, వెంటనే రంగంలోకి దిగిన సుష్మ... ఈ విషయమై సౌదీలో భారత దౌత్యాధికారితో చర్చించారు. ఈ నేపథ్యంలో, సౌదీ అధికారులతో జరిగిన పలు సంప్రదింపుల అనంతరం భారత కార్మికుల విడుదలకు మార్గం సుగమమైంది. విద్యుదాఘాతానికి గురైన తమ సహచరుడి మృతికి నిరసన తెలపడమే ఈ భారత కార్మికులు చేసిన నేరం. వారి నిరసన కారణంగా తనకు నష్టం వాటిల్లిందని సదరు కంపెనీ యజమాని చేసిన ఫిర్యాదుతో వీరు జైలు పాలయ్యారు.