: నెల్లూరు రైల్వేస్టేషన్ లో ఎస్కలేటర్ ను ప్రారంభించిన వెంకయ్యనాయుడు
నెల్లూరు రైల్వేస్టేషన్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్కలేటర్ ను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు రైల్వేస్టేషన్ ను ఆధునికీకరిస్తామని చెప్పారు. బిట్రగుంటలో ఉన్న 1300 ఎకరాల్లో రైల్వే ప్రాజెక్టుకు కృషి చేస్తామని తెలిపారు. అటు వెంకటాచలం-ఓబులవారిపల్లె రైల్వే లైను పనులను మూడేళ్లలో పూర్తిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవతో పాటు పలువురు హాజరయ్యారు.