: జానారెడ్డికి అమరవీరుల ఉసురు తగులుతుంది: కోమటిరెడ్డి


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకుండా రాష్ట్ర మంత్రి జానారెడ్డి అడ్డుపడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. అమర వీరుల ఉసురు జానారెడ్డికి తగులుతుందని ఆయన శపించారు. వారి బలిదానాలకు తెలంగాణ మంత్రులదే బాధ్యత అన్న వెంకటరెడ్డి..వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలన్నారు. ఇందుకోసం కోర్టు కెళ్లేందుకు సిద్ధమని ఆయన హెచ్చరించారు. నిరంతరం పోలీసు పహారాలో ఉంటున్న జానారెడ్డి ఒకసారి ప్రజల్లోకి వస్తే వారి ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని కోమటిరెడ్డి  అన్నారు. 

  • Loading...

More Telugu News