: విమాన ప్రమాద మృతుల్లో మలేసియా ప్రధాని అమ్మమ్మ
మలేసియా విమాన ప్రమాద మృతుల్లో ఆ దేశ ప్రధాని నజీబ్ రాజక్ అమ్మమ్మ శ్రీ సిటి అమీరహ్ కూడా ఉన్నారు. తాజాగా ఈ విషయాన్ని మలేసియా రక్షణమంత్రి, ప్రధాని సోదరుడు హిషమ్ముద్దీన్ హుస్సేన్ వెల్లడించారు. ఈ మేరకు తమ అమ్మమ్మ మరణవార్తను ట్విట్టర్లో తెలుపుతూ ఆమె ఫొటోను పెట్టారు. ఆమె స్వస్థలం ఇండోనేషియా అని, అక్కడి జోగ్ జకార్తా నగరానికి వెళ్లేందుకు అమ్మమ్మ ఆమ్ స్టర్ డామ్ లో విమానం ఎక్కారని వివరించారు. రంజాన్ పండుగ మరికొన్ని రోజుల్లో ఉన్న సమయంలో బంధుమిత్రులతో ఆనందంగా గడిపేందుకు వస్తున్న తరుణంలో ఆమె మృతి చెందిందని తెలిపారు.