: ట్యాబ్లెట్ కొంటే... ఏడాది పాటు ఇంటర్నెట్ ఫ్రీ
భారత ప్రభుత్వానికి ఆకాశ్ ట్యాబ్లెట్ లను సరఫరా చేస్తున్న డేటావిండ్ సంస్థ సరికొత్త మార్కెటింగ్ టెక్నిక్స్ తో దేశీయ మార్కెట్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలో, వినియోగదారులకు ఓ స్పెషల్ ఆఫర్ ను ప్రకటించింది. తాము అమ్ముతున్న యుబిస్లెట్ ట్యాబ్లెట్ పీసీల తో ఏడాది పాటు ఫ్రీ ఇంటర్నెట్ ఆఫర్ ను డేటావిండ్ ప్రకటించింది. యూబీస్లెట్ 7సీజెడ్, 3జీ7 మోడళ్ల విక్రయంపై ఉచిత ఇంటర్నెట్ ఆఫర్ కల్పించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌తో డేటావిండ్ ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణాదికి చెందిన మొబైల్ రిటైల్ స్టోర్ యూనివర్సల్ ద్వారా ఇక పై తమ ఉత్పత్తులను అమ్ముతామని డేటావిండ్ ప్రకటించింది.