: తిరుమల వెంకన్నకు కానుకగా మహీంద్రా బొలెరో
తిరుమల వేంకటేశ్వరస్వామికి ఇటీవల కాలంలో పలువురు వాహనాలను సమర్పించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు సోదరులు రూ.9 లక్షల విలువైన మహీంద్రా బొలెరో వాహనాన్ని శ్రీవారికి సమర్పించుకున్నారు. తిరువూరుకు చెందిన బాలసుబ్రహ్మణ్యం సోదరులు ఈ మహీంద్రా బొలెరో వాహనాన్ని శుక్రవారం ఉదయం ఆలయం ముంగిట నిలిపి అర్చకులతో పూజలు చేయించారు. అనంతరం ఆలయ ఈవో గోపాల్ కు అందజేశారు. గతంలో వీరు ఇలాంటి వాహనాన్నే స్వామివారికి కానుకగా ఇవ్వగా, తిరుమలలో పుష్పాలను రవాణా చేయడానికి పుష్పరథం పేరిట దానిని వినియోగిస్తున్నారు.