: బాబు నాయకత్వంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది: లోక్ సభ స్పీకర్
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు రెండోరోజు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. బాబు నాయకత్వంలో రాష్ట్రం పురోగామి పథంలో పయనిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు.