: ముంబైలో ట్రాఫికర్ల ఆటకట్టు, 100 మంది బాలికలకు విముక్తి


కొద్దిసేపుంటే ఆ వంద మంది బాలికలు దేశాన్ని వీడేవారేమో. ముంబై పోలీసుల సత్వర స్పందనతో ఆ బాలికలంతా ట్రాఫికర్ల బారి నుంచి సురక్షితంగా తప్పించుకోగలిగారు. శనివారం ఉదయం ముంబై నగరంలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన దాదాపు వంద మంది బాలికలు, యువతులను ట్రాఫికర్లు నగరంలోని ఓ ఫిష్ కంపెనీలో బందీలుగా ఉంచారు. అయితే విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పాటు ఏమాత్రం ఆలస్యం చేసినా, కిరాతకులు బాలికలను విమానమెక్కించేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు తక్షణమే అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఫిష్ కంపెనీపై దాడి చేసిన పోలీసులు వంద మంది బాలికలను సురక్షితంగా కాపాడారు. ఫిష్ కంపెనీ ప్రతినిధులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News