: బాల్ టాంపరింగ్ కు పాల్పడిన దక్షిణాఫ్రికా పేసర్ కు జరిమానా


దక్షిణాఫ్రికా పేసర్ వెర్నాన్ ఫిలాండర్ కు ఐసీసీ జరిమానా విధించింది. శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా ఫిలాండర్ బంతి స్వరూపాన్ని ఉద్దేశపూర్వకంగా మార్చేందుకు ప్రయత్నించినట్టు టెలివిజన్ ఫుటేజిలో స్పష్టమైంది. దీనిపై ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన క్రో... ఫిలాండర్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News