: రెండ్రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం


బంగాళాఖాతంలో వచ్చే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల చెదురుమదురు వానలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశముంది. అల్పపీడన ప్రభావం వల్ల కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News