: గంగిరెడ్డి జాడ జగన్ ఒక్కడికే తెలుసు: టీడీపీ
శ్రీకాకుళం పర్యటనలో చంద్రబాబును 420 అన్న జగన్ పై టీడీపీ నేతలు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. ఏపీ సర్కార్ కు అనేక అంశాల్లో అన్యాయం జరుగుతున్నా తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఒక్క మాట అనని జగన్... చంద్రబాబును మాత్రం అదే పనిగా విమర్శిస్తున్నారని వారు అన్నారు. చంద్రబాబును విమర్శించడం మానేసి... తన చుట్టూ ఎవరు ఉన్నారో జగన్ ఒకసారి చూసుకోవాలని వారు సూచించారు. జగన్ చుట్టూ స్మగ్లర్లు, బ్యాంకులను తదితర ఆర్థిక సంస్థలను లూటీ చేసిన వ్యక్తులు ఉన్నారని వారు అన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి జాడ జగన్ ఒక్కడికే తెలుసని వారు ఆరోపించారు. గంగిరెడ్డిని జగన్ లోటస్ పాండ్ లో లేక బెంగళూర్ ప్యాలెస్ లో దాచాడా? లేక ఇడుపుల పాయ ఎస్టేట్ లో పెట్టాడో..? చెప్పాలని వారు ప్రశ్నించారు. చంద్రబాబుకు నీతులు చెప్పడం మానేసి... ముందు జగన్ తనను తాను సరిచేసుకోవాలని వారు సూచించారు.