: పాలిచ్చే గేదెపై అత్యాచారం... నిందితుడికి జైలుశిక్ష


కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ వ్యక్తి పాలిచ్చే గేదెపై అత్యాచారం చేసి జైలు పాలయ్యాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామంలో జరిగింది. 2013 జులై 12న జరిగిందీ దారుణం. గేదె యజమాని బాలయ్య మేత వేసేందుకు రాగా, ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన నీలం లచ్చయ్య (48) అనే వ్యక్తి గేదెపై అత్యాచారం చేస్తూ కనిపించాడు. దీనిపై బాలయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. అనంతరం గేదెకు పశువైద్యులతో పరీక్షలు నిర్వహించి, నమూనాలు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. తగిన ఆధారాలతో లచ్చయ్యను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన కరీంనగర్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అజార్ హుస్సేన్ నిందితుడికి రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

  • Loading...

More Telugu News