: తాడేపల్లి సమీపంలో దారి దోపిడీ ముఠా అరెస్ట్
గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు శనివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఐదుగురు మహిళలు, ఇద్దరు యువకులతో పాటు ఓ హిజ్రా కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రహదారిపై మాటువేసి వాహనదారులపై దాడులకు దిగి, వారి వద్దనున్న నగదుతో పాటు విలువైన వస్తువులను ముఠా అపహరిస్తూ వస్తోంది. శనివారం తెల్లవారుజామున కూడా ఎప్పటిలాగే ఈ ముఠా దోపిడీలకు పాల్పడింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే అప్రమత్తమైన పోలీసులు ఈ ముఠాను పట్టేశారు. ఈ సందర్భంగా ముఠా సభ్యుల నుంచి పోలీసులు పెద్ద ఎత్తున నగదు, సెల్ ఫోన్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.