: మీ పాపేమీ 'షటిల్ కాక్' కాదు: ఓ జంటకు సుప్రీం మందలింపు
ఓ చిన్నారిని నాలుగురోజులు తల్లి వద్ద, మూడు రోజుల తండ్రి వద్ద ఉండేలా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది. ఇష్టంవచ్చినట్టు ఆడుకోవడానికి ఆ పాప ఏమీ 'షటిల్ కాక్' కాదని ఆ చిన్నారి తల్లిదండ్రులను సైతం మందలించింది. మద్రాస్ హైకోర్టు ఈ కేసులో వ్యవహరించిన తీరును సమర్థించలేమని, ఆ బాలికనో ఆటవస్తువులా పరిగణించారని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ లతో కూడిన ద్విసభ్య బెంచ్ వ్యాఖ్యానించింది. కుమార్తెను తన నుంచి బలవంతంగా తీసుకెళుతున్నాడంటూ మాజీ భర్తపై చేసిన ఫిర్యాదును విచారిస్తూ సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది.