: బల్లాన్స్ సెంచరీ... రాణించిన భువనేశ్వర్
లార్డ్స్ టెస్టులో భారత్ ముంగిట అవకాశాలు నిలిచాయి. తొలి ఇన్నింగ్స్ లో ధోనీ సేన 295 పరుగులకు ఆలౌట్ అయింది. బదలుగా, బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు రెండోరోజు ఆట చివరికి 6 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. ఇంగ్లండ్ యువకెరటం గారీ బల్లాన్స్ (110) సెంచరీతో ఆకట్టుకున్నాడు. కుక్ సేన భారీస్కోరు దిశగా సాగిపోతుందనుకుంటున్న తరుణంలో భువనేశ్వర్ కుమార్ పదునైన బౌలింగ్ తో అడ్డుకట్ట వేశాడు. భువీ 4 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ జట్టులో మొయిన్ అలీ 32 పరుగులు చేశాడు. కెప్టెన్ కుక్ (10) మరోసారి విఫలమయ్యాడు. కాగా, ఇంగ్లండ్ జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 76 పరుగులు వెనకబడి ఉంది. చేతిలో నాలుగు వికెట్లున్నాయి.