: రాష్ట్రంలో జాతీయక్రీడల నిర్వహణకు చంద్రబాబు యత్నం
ఆంధ్రప్రదేశ్ లో జాతీయ క్రీడల నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ కు లేఖ రాశారు. 2017లో జరిగే 39వ జాతీయ క్రీడలకు తాము ఆతిథ్యమిస్తామని, అందుకు అవకాశం కల్పించాలని బాబు తన లేఖలో పేర్కొన్నారు. విజయవాడ వేదికగా ఈ క్రీడలు నిర్వహిస్తామని తెలిపారు. జాతీయ క్రీడల నిర్వహణతో రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. విశాఖ, కాకినాడ, తిరుపతి వంటి నగరాలకు ప్రపంచస్థాయి క్రీడా వసతులు లభిస్తాయని పేర్కొన్నారు గతంలో జాతీయ, అంతర్జాతీయ పోటీలు సమర్థంగా నిర్వహించిన అనుభవం, శక్తి తమకున్నాయని ఆ లేఖలో వివరించారు.