: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి ఘనసన్మానం
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని బీజేపీ శ్రేణులు ఘనంగా సన్మానించాయి. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా నెల్లూరు జిల్లాకు వచ్చిన వెంకయ్యకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... క్రమశిక్షణే తనను ఉన్నతస్థాయికి తీసుకెళ్లిందని అన్నారు. అధికారం వచ్చిన తర్వాత నాయకులకు వినయ విధేయతలు ఉండాలని ఆయన సూచించారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే రైల్వే ఛార్జీలను పెంచామని ఆయన వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానన్నారు .