: చంద్రబాబుతో ముగిసిన టీ-టీడీపీ నేతల భేటీ


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతల సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇక నుంచి ప్రతి శనివారం టీ-టీడీపీ నేతలు సమావేశమవ్వాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. పనిచేసేవారికి అవకాశం కల్పించాలని చంద్రబాబు సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అందరూ కృషి చేయాలని బాబు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News