: మల్కాజ్ గిరి సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత


గ్రేటర్ హైదరాబాదు పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత కొనసాగుతోంది. అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన వాటిని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. సఫిల్ గూడ డివిజన్ పరిధిలోని ప్లాట్ నెం. 440లో ఎటువంటి అనుమతులు లేకుండా జరుగుతున్న నిర్మాణాన్ని అధికారులు నేలమట్టం చేశారు. ఈ సందర్భంగా టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీమాన్ గౌడ్ మాట్లాడుతూ, భవన యజమానికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, అయితే వారి నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో అక్రమ కట్టడాన్ని కూల్చివేసినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News