: ఢిల్లీ బడ్జెట్ పై కేజ్రీవాల్ విమర్శలు


2014-15 సంవత్సరానికిగానూ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్ పై ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలపై బీజేపీ యూటర్న్ తీసుకుందన్నారు. ''పన్నుల్లో 30 శాతం తగ్గిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ, అదేం చేయలేదు. ఎందుకు ఈ యూటర్న్ తీసుకున్నారు? దాదాపు అన్ని ఎన్నికల హామీల నుంచి కమలం వెనక్కి తగ్గింది" అని ట్వీట్ చేశారు. ఇక పెరుగుతున్న ధరలను తగ్గించేందుకు రాష్ట్ర బడ్జెట్ లో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఢిల్లీలో విద్యుత్ సరఫరాను ఎలా పెంచుతారు, మంచినీరు లేని ప్రాంతాల్లో ఎలా నీరు అందిస్తాము? అనే విషయాలపై స్పష్టత ఇవ్వలేదని మండిపడ్డారు. దేశ రాజధానిలో ప్రజల సమస్యలను బీజేపీ అర్ధం చేసుకోవడం లేదని కేజ్రీ ఆరోపించారు.

  • Loading...

More Telugu News