: మలేసియా విమానంపై సరదాగా చేసిన కామెంట్ నిజమైపోయింది
కీడెంచి మేలెంచమన్నారు పెద్దలు. అలాగే మలేసియా విమాన ప్రమాదంపై ఆ విమాన ప్రయాణికుడు చేసిన సరదా వ్యాఖ్య నిజమైపోయింది. సాంకేతిక విప్లవంతో ప్రతిదానినీ సామాజిక సైట్లలో పంచుకోవడం వ్యసనంగా మారింది. దీంతో కోర్ పాన్ అనే నెదర్లాండ్స్ దేశస్థుడు మలేసియా విమానం ఎక్కడానికి కొద్ది సేపటికి ముందు 'విమానానికి ఏదైనా ప్రమాదం జరిగితే... చెప్పుకోవడానికి... ఇదిగో నేనెక్కిన విమానం ఇలా ఉంటుంది' అంటూ ఎంహెచ్ 17 ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. దీనిపై అతని మిత్రులు సరదా కామెంట్లు కూడా చేస్తూ క్షేమంగా గమ్యం చేరుకోవాలని ఆకాంక్షించారు. దురదృష్టవశాత్తు అతను గమ్యం చేరుకోకముందే అనంతవాయువుల్లో కలిసిపోయాడు. కాగా, కోర్ పాన్ తో పాటు అతని ప్రేయసి నీల్ ట్యే తోలా కూడా అదే విమానంలో ఉండి అసువులు బాసింది.